ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్  యాస్మిన్ భాష

ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్  యాస్మిన్ భాష
District Collector Yasmin Bhasha

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జిల్లాలో మార్చి 15 నుండి ఏప్రిల్ 1 వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలు వార్షిక పరీక్షలను  అన్ని సౌకర్యాలు కల్పించిపకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులకు , 29 సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులకు  కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్  దిశా నిర్దేశం చేశారు . ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి లేనందున దూర ప్రాంత విద్యార్థులను సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేర్చడానికి ఆర్టీసీ అధకారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యశాఖ వారిని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యుత్తు సరఫరా అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు ఇతర శాఖల అధికారులు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు కోరిన విధంగా సహకారం అందించాలన్నారు.  పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా తగు చర్యలు తీసుకునాలని తగినంత సంఖ్యలో ఫ్లయింగ్ ,  సిట్టింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు  చేయాలని జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్  లత,  జిల్లా అధికారులు,  జిల్లా విద్యాశాఖ అధికారి , జిల్లా వైద్య శాఖ అధికారి, పోస్టల్ సూపరింటెండెంట్, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ అగ్నిమాపక శాఖ తోపాటుగా జిల్లా పరీక్షల కన్వీనర్ బి నారాయణ, డిఈసి మెంబర్లు అబ్దుల్ కాలిక్,  K.గంగాధర్ పాల్గొన్నారు.